Monday, 4 July 2011

రాష్ట్ర విభజన

 జై సమైక్యాంధ్ర !!!
రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రము ఎన్ని భాగాలుగా విభజించాలి ౩ లేదా ౨.  రాయలసీమకు తెలంగాణా కన్నా ఎక్కువ నష్టం జరిగినది. విభజన తరువాత కూడా ఎక్కువగా నష్టం జరిగేది రాయలసీమకే. అభివృద్ధి ఫై శ్వేత పత్రం విడుదల చేసిన ఇది అక్షర సత్యం. విభజన అయితే రాయలసీమ విషయంలో ఏరకమైన నిర్ణయం ఉంటుందో స్పష్టత ఉండాలి. అంతేకాక, ప్రపంచ బ్యాంకు నుండి రాష్ట్రమునకు తీసుకు వచ్చిన అప్పులో హైదరాబాద్ పరిసరాలు అభివృద్ధికే ఎక్కువగా ఉపయోగించారు. ఇప్పుడు విభజన జరిగితే, హైదరాబాద్ తెలంగాణకు ఇస్తే అప్పుడు రాష్ట అప్పులో అత్యదిక శాతం తెలంగాణ భరించాలి. అప్పు విషయంలో రాయలసీమకు  ఎటువంటి సంబంధం ఉండకుండా చూడాలి. మరియు నీటి వాటా విషయంలో తెలంగాణతో ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హామీలు ఉండాలి. అంతే కాకుండా రాయలసీమ అభివృద్ధి కొరకు  ప్రతేక ప్యాకేజి లక్షల కోట్ల రూపాయలు ప్రకటించాలి మరియు అది రాజకీయ నాయకుల జోబీలకు  పోకుండా పకడ్బందిగా నిధుల వినియోగం జరిగేల చూడాలి. ప్రజలు చైతన్యవంతులై పరిపాలనలో భాగస్వాములు కావాలి.
ప్రతి పైసా ఖర్చు పారదర్శకంగా ఉండాలి. అప్పుడే రాయలసీమ మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుంది. రాయలసీమ ప్రజలారా చైతన్యవంతులై స్వపరిపాలనకు సిద్దంగా ఉండగలరు. అయితే మొదటగా రాష్ట్రము సమైక్యముగా ఉండాలని కోరుకుందాం.
ఇట్లు 
కృతి.


తెలంగాణ
తెలంగాణ వాదం ఎంత వరకు సమంజసం?  అభివృధి లో వెనకబాటు తనం అంటూ  అభివృద్ధి కొరకు పోరాటం అంటున్నారు. సీమంధ్రులు తెలంగాణను దోచుకుంటున్నారు అంటున్నారు.  మరి సామాన్య ప్రజలు దోచుకుంటున్నారు అనటంలో ఎంత నిజం వున్నది ప్రతి ప్రసంగం లో సీమంధ్రులు మా నీరు మా మన్ను  దోచుకుంటున్నారు అంటున్నారు. ఏనాడు మీరు అభివృద్ధి కొరకే పోరాడలేదు విభజన కొరకు మాత్రమే పోరాడుతున్నారు. అభివృద్ధి కీలక పాత్రగా అందించిన ప్రత్యేక  జీవోలు ప్రత్యేక ప్యాకేజీలు సరిగా అమలు కానపుడు వాటికొరకు మీరు చేసిన పోరాటాలు ఎంత ఘాటుగా ఉన్నేయో ఆత్మ విమర్శ చేసుకోండి? ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాలు,  ప్రత్యేక  జీవోలు ప్రత్యేక ప్యాకేజీల ఫై  ప్రభుత్వం అలసత్వం చేసిన సందర్భాలలో చేసివుంటే.  ఈరోజు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కద?  ప్రస్తుతం  రాజకీయ నాయకుల హైడ్రామా లో పావులాల విద్యార్థులు మారారు. విచక్షణను మరచి రాష్ట్రమును రావణ కాష్టంగా మారుస్తన్నారు. అటు సీమాంద్ర  విద్యార్థులు కానీ ఇటు తెలంగాణ విద్యార్థులు కానీ విచక్షణతో భాద్యతాయుతంగా రాష్ట్ర అభివృద్ధి లో పలుపంచుకోవలసిన సమయం ఇది. ప్రస్తుతం మన రాష్ట్రము అభివృద్ధి పంధాలో  లో పయనిస్తున్నది దానికి విఘాతం కలగకుండా చూడవలసిన భాద్యత అందరిది.
ఈ దిశగా అందరి అడుగులు ఉంటాయని ఆశిస్తూ ....
మీ కృతి.