జై సమైక్యాంధ్ర !!!
రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రము ఎన్ని భాగాలుగా విభజించాలి ౩ లేదా ౨. రాయలసీమకు తెలంగాణా కన్నా ఎక్కువ నష్టం జరిగినది. విభజన తరువాత కూడా ఎక్కువగా నష్టం జరిగేది రాయలసీమకే. అభివృద్ధి ఫై శ్వేత పత్రం విడుదల చేసిన ఇది అక్షర సత్యం. విభజన అయితే రాయలసీమ విషయంలో ఏరకమైన నిర్ణయం ఉంటుందో స్పష్టత ఉండాలి. అంతేకాక, ప్రపంచ బ్యాంకు నుండి రాష్ట్రమునకు తీసుకు వచ్చిన అప్పులో హైదరాబాద్ పరిసరాలు అభివృద్ధికే ఎక్కువగా ఉపయోగించారు. ఇప్పుడు విభజన జరిగితే, హైదరాబాద్ తెలంగాణకు ఇస్తే అప్పుడు రాష్ట అప్పులో అత్యదిక శాతం తెలంగాణ భరించాలి. అప్పు విషయంలో రాయలసీమకు ఎటువంటి సంబంధం ఉండకుండా చూడాలి. మరియు నీటి వాటా విషయంలో తెలంగాణతో ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హామీలు ఉండాలి. అంతే కాకుండా రాయలసీమ అభివృద్ధి కొరకు ప్రతేక ప్యాకేజి లక్షల కోట్ల రూపాయలు ప్రకటించాలి మరియు అది రాజకీయ నాయకుల జోబీలకు పోకుండా పకడ్బందిగా నిధుల వినియోగం జరిగేల చూడాలి. ప్రజలు చైతన్యవంతులై పరిపాలనలో భాగస్వాములు కావాలి.
ప్రతి పైసా ఖర్చు పారదర్శకంగా ఉండాలి. అప్పుడే రాయలసీమ మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుంది. రాయలసీమ ప్రజలారా చైతన్యవంతులై స్వపరిపాలనకు సిద్దంగా ఉండగలరు. అయితే మొదటగా రాష్ట్రము సమైక్యముగా ఉండాలని కోరుకుందాం.
ఇట్లు
కృతి.